అల్లుడితో రొమాంటిక్ బ్యూటీ ..

బెల్లకొండ సురేష్ వారసుడి గా గ్రాండ్ గా ఇండస్ట్రీ లోకి హీరో గా ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్..మొదటి సినిమాతోనే బాగా పాపులర్ అయ్యాడు. ఆ తర్వాత హిట్ , ప్లాప్ లతో సంబంధం లేకుండా ఏడాదికి రెండు , మూడు సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ ఇంతవరకు మాత్రం అసలైన హిట్ కొట్టలేకపోయాడు. కథను పెద్దగా పట్టించుకోకుండా..ఏ కథ పడితే..ఆ కథ కు ఓకే చెప్పి ప్లాప్ లు అందుకున్నాడు. ప్రస్తుతం కందిరీగ ఫేమ్ సంతోష్ శ్రీనివాస్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి అల్లుడు అదుర్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు.

బెల్లంకొండ శ్రీనివాస్ కోసం డైరెక్ట‌ర్ సంతోష్ శ్రీనివాస్ ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటెర్టైనర్ తో కూడుకున్న యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశాడట. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కేతిక శర్మ ఒక ఐటమ్ సాంగ్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది. రొమాంటిక్ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే

ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డబోతున్నారు. అందుకోసం బెల్లంకొండ శ్రీనివాస్ ప్ర‌త్యేకంగా కొత్తగా మేకోవ‌ర్ అయ్యారు. ఒకరకంగా చెప్పాలంటే గతంలో సంతోష్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసిన ‘కందిరీగ’ ఫార్మాట్లో ఈ సినిమా ఉంటుందట. ఆ చిత్రంలో ఉన్నట్టే హీరో పాత్ర ఫుల్ ఎనర్జీతో నడుస్తుందని.. మొత్తానికి సినిమా ఫుల్ ఎంటర్ టైనర్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో నభ నటేష్, అను ఇమ్మాన్యుయేల్ కథానాయికలుగా నటిస్తుండగా చోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుమంత్ మూవీ ప్రొడ‌క్షన్స్ బ్యాన‌ర్‌పై జి.సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్నారు.