‘శ్రీనివాస కళ్యాణం’ లెక్క తప్పింది..

లై, చల్ మోహన్ రంగ చిత్రాలతో ప్రేక్షకులను , అభిమానులను నిరాశ పరిచిన నితిన్..శతమానం భవతి ఫేమ్ సతీశ్ వేగేశ్న దర్శకత్వం లో దిల్ రాజు బ్యానర్ లో శ్రీనివాస కళ్యాణం చిత్రం తో గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. తెలుగు సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ సినిమా ఉండబోతుందని చిత్ర యూనిట్ ప్రచారం చేయడం , ట్రైలర్స్ , ఆడియో , ప్రోమోస్ అలాగే ఉండడం తో ప్రేక్షకులు సైతం ఈ మూవీ ఫై భారీ అంచనాలే పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను అందివ్వడం లో కాస్త డైరెక్టర్ తడబడ్డాడు. దీంతో అనుకున్న టాక్ బయటకు రాలేకపోవడం తో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ ఫై పడుతుంది.

తొలి రోజుకు ఈ సినిమా 2.77 కోట్ల రూపాయల గ్రాస్‌ను వసూలు చేసినట్టుగా సమాచారం. ఈ సినిమా బడ్జెట్ కాస్త ఎక్కువ అవ్వడం తో వారు అనుకున్న ఫస్ట్ డే కలెక్షన్లు రాబట్టలేకపోయిందట. వీకెండ్ కావడం తో సినిమా కలెక్షన్లకు పెద్దగా ఇబ్బంది ఈమె ఉండదు కానీ సోమవారం నుండి ఎలా వసూళ్లు అవుతాయి అనేది మాత్రం చిత్ర నిర్మాతలను కాస్త టెన్షన్లో పడేస్తుందట. ఇక ఈ మూవీ లో నితిన్ కు జోడిగా రాశిఖన్నా జోడి కట్టగా , జయసుధ , ప్రకాష్ రాజ్ , నరేష్ , రాజేంద్ర ప్రసాద్ మొదలుగు వారు ముఖ్య పాత్రల్లో నటించారు.