శ్రీరామ్ ఆదిత్య.. మళ్ళీ అదే జోనర్

ఇప్పటివరకూ రెండు సినిమాలు తీశాడు శ్రీరామ్ ఆదిత్య. భలే మంచి రోజు, శమంతకమణి. ఈ రెండు కూడా క్రైమ్ మిక్స్ చేసిన ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్లు. ఇందులో ‘భలే మంచి రోజు’కి చాలా మంచి పేరు వచ్చింది. మొదటి సినిమానే భలే తీశాడు అని పేరు తెచ్చుకున్నాడు శ్రీరామ్ ఆదిత్య. ఐతే శమంతకమణి మాత్రం ఊహించినంత విజయం సాధించలేకపోయింది. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య ఓ మల్టీస్టారర్ చేశాడు. నాగార్జున, నానిలతో దేవదాస్‌ తీశాడు. ఆకాంక్ష సింగ్‌, రష్మికా హీరోయిన్స్. ఈ సినిమా ట్రైలర్ ని వదిలారు. ఇదీ కూడా క్రైమ్ టచ్ వున్న కామెడీ ఎంటర్‌టైనరని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.

టైటిల్ కి జస్టిఫికేషన్ ఇస్తూ ‘అంతా భ్రాంతియేనా.. జీవితాన వెలుగింతేనా..’ అని దేవదాస్ లోని ఓ పాటతో ట్రైలర్ మొదలౌతుంది. అక్కడి నుండి ట్రైలర్ పరుగులు పెడుతుంది. “ఒకే నేనిక వెళ్ళొచ్చా” “చీర్స్ కొట్టకుండా తాగేశావేంట్రా?” నీ ప్రాబ్లెం ఏంటో తెలుసా?” “అయినా నీలాంటివాడికి ప్రేమంటే ఏం తెలుస్తుంది చెప్పు!” ఇలా నాని, నాగార్జున ల మధ్య వచ్చిన సంభాషణలు అలరిస్తాయి. మొత్తానికి మళ్ళీ తన స్టయిల్ లోనే క్రైమ్ కి కామెడి అద్దాడు శ్రీరామ్ ఆదిత్య.