సుధీర్ బాబుతో మెహరీన్ రోమాన్స్

సుధీర్ బాబు స్పీడందుకున్నాడు. చకచకా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే నన్ను దోచుకుందువటే విడుదలకు రెడీగా వుంది. అదికాక మరో రెండు సినిమాలు చేతిలో వున్నాయి. ఇప్పుడు వీటికన్నా ముందుగా మరోటి స్టార్ట్ చేసేస్తున్నాడు. పులి వాసు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సుదీర్. ఆయనకు జంటగా మెహరీన్ కనిపించనుంది.

ఆగస్టు 17న ఉదయం 9.30 గంటలకు రామానాయుడు స్టూడియోస్‌లో సినిమా షూటింగ్‌ ప్రారంభం కానుందని నిర్మాతలు ప్రకటించారు. నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వి.వి వినాయ‌క్, రచయిత ప‌రుచూరి గోపాలకృష్ణ ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నట్లు తెలిపారు.

Also Read :   ఉదయం 11 గంటల్లోపు ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం

ఇక ఇటీవల ‘సమ్మోహనం’ సినిమాతో హిట్‌ అందుకున్న ఆయన ప్రస్తుతం ‘నన్ను దోచుకుందువటే’లో నటిస్తున్నారు. ఆర్‌.ఎస్‌.నాయుడు దర్శకుడు. కన్నడ నటి నభా నతీష్‌ కథానాయిక. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోంది ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన లభించింది.