సుకుమార్ కి వెయిటింగ్ తప్పదు

రంగస్థలంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు సుకుమార్ .. కొత్త సినిమా ఇప్పటికీ చేయలేదు. మైత్రీ-మహేష్ కాంబో సినిమా వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది. అల్లు అర్జున్ తో ఓ సినిమా ప్రకటించాడు.

ప్రస్తుతం.. బన్నీ, త్రివిక్రమ్ సినిమా స్టార్ట్ చేయాలి. దాని తరువాత సైలెంట్ గా వేణు శ్రీరామ్-దిల్ రాజు కాంబోకి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. ఆ సినిమా చేసిన తరువాతే సుకుమార్ సినిమా అని క్లియర్ గా తెలుస్తోంది. అప్పటికి మరో డైరక్టర్ ఎవరూ మధ్యలోకి రాకుండా వుండాలి.

మొత్తంమ్మీద చూసుకుంటే చూసుకుంటే 2019లో మాత్రం సుకుమార్ సినిమా వుండే అవకాశాలు కనిపించడం లేదు. రంగస్థలం లాంటి క్లాసిక్ తర్వాత సుకుమార్ కి కొత్త సినిమా సెట్ కావడం ఇంత ఆసల్యం అవ్వడం పై ఆయన ఫ్యాన్స్ కూడా నిరాసగా వున్నారు.