‘పుష్ప’ టీమ్‌కి వార్నింగ్‌ ఇచ్చిన సుకుమార్

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో పుష్ప మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందు మొదటి షెడ్యూల్ జరుగగా..ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చి షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో షూటింగ్ ను స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మారేడుమిల్లి అరణ్యంలో చిత్రీకరణ జరుగుతోంది. అల్లు అర్జున్‌తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ నుంచి ఇటీవల బన్నీ లుక్ ఒకటి లీక్‌ అయిన విషయం తెలిసిందే. అందులో రఫ్ లుక్‌లో బన్నీ ఉండగా.. ఫ్యాన్స్‌ని తెగ ఆకట్టుకుంది. కాగా ఈ లుక్‌ లీక్‌ అవ్వడంపై సుకుమార్ ఫైర్ అయ్యారట. ఈ లీక్‌కి కారకులెవరో తెలుసుకుంటానని ఆయన మండిపడ్డారట. అంతేకాదు బయటివారు ఎవ్వరూ లోపలికి రాకుండా చూసుకోవాలని ప్రొడక్షన్‌ టీమ్‌కి ఆదేశాలు జారీ చేశారట. ఇంకోసారి ఎలాంటి లీక్‌ ఉండకూడదని హెచ్చరించారట. దీంతో ప్రొడక్షన్‌ టీమ్‌ మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.