సుమ , అనసూయ ల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

బుల్లితెరఫై టాప్ యాంకర్ అంటే ఎవరైనా సుమ పేరే చెపుతారు..చిన్న పిల్లాడి దగ్గరి నుండి పండు ముసలి వారు సైతం సుమ యాంకరింగ్ ను ఇష్టపడతారు. చాలామంది ఈమె యాంకరింగ్ కోసమే పలు కార్యక్రమాలు చూస్తుంటారు. ఈమె తర్వాత అంత గుర్తింపు తెచ్చుకున్న భామ అనసూయ. అప్పటివరకు యాంకర్ అంటే ఇలాగే ఉంటారు అనుకున్న వారికీ ఇలా కూడా ఉంటారని రుజువు చేసింది.

జబర్దస్త్ షోలో హాట్ హాట్ అందాలను చూపిస్తూ అతి తక్కువ టైంలోనే అగ్ర యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. కేవలం బుల్లి తెర పైనే కాదు వెండితెరఫై కూడా ఈ రంగమ్మత్త బిజీ నటిగా మారింది. వీరితో పాటు రేష్మి, మంజూష, శ్యామల ఇలా చాలామంది ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకుని రాణిస్తున్నారు. మరి వీరి రెమ్యూనరేషన్ ఇలా ఉంటుందనేది అందరికి కలిగి ప్రశ్న. యాంకర్లుకు ఏం ఇస్తారులే అనుకుంటే పొరపాటే..హీరోయిన్ల కంటే వీరి సంపాదనే ఎక్కువ.

* యాంకర్ సుమ ఒక్కో ఈవెంట్ కి రూ.2- 2.5లక్షల మధ్యలో రెమ్యూనరేషన్ అనుకుంటుందట. భారీగా అవార్డులు వంటి స్టేజ్ కార్యక్రమాలకు అయితే ఇంకా పెద్ద మొత్తమే అందుకుంటుందని సమాచారం.

* అనసూయ ఒక్కో ఈవెంట్ కి రూ.2లక్షలు అందుకుంటుందట.

* రష్మీ 1.50- 1.75 లక్షల రేంజులో అందుకుంటోందట. ఇక యాంకర్ శ్యామల బిగ్ బాస్ తో ఎంతగా ఫేమస్ అయ్యారో తెలిసిందే. అంతకుముందే ఒక్కో ఈవెంట్ కి రూ.50వేల వరకూ అందుకున్నారట.

* మంజూష ఒక్కో ఈవెంట్ కి రూ.30 వేలు- రూ50వేల వరకూ అందుకుంటోందట.

* సోనియా రూ.20 వేలు- 30వేల రేంజు పారితోషికం అందుకుంటుందని సమాచారం. మొత్తం మీద యాంకర్ల సంపాదన హీరోయిన్ల కంటే ఎక్కువే.