రెండో పెళ్లికి సిద్దమైన ప్రముఖ సింగర్..?

గాయని గా సింగర్ గా ఎన్నో వందల చిత్రాలలో పనిచేసిన ప్రముఖ సింగర్ సునీత..త్వరలో రెండో పెళ్లి చేసుకోబోతుందా..ఇప్పుడు ఇదే చర్చ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో జరుగుతుంది. సింగర్ సునీతగా పాపులర్ అయిన ఆమె కొన్నేళ్ల క్రితమే తన భర్త నుంచి విడాకులు తీసుకున్న సంగతి తెల్సిందే. వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ.. పైకి మాత్రం ఆమె చిరునవ్వుతోనే కనిపించేవారు. సునీతకి 19 ఏళ్ల వయసులోనే కిరణ్ అనే వ్యక్తి తో పెళ్లయ్యింది. ఇద్దరు పిల్లలు పుట్టాక.. భర్త తీరుతో విసిగిపోయిన ఆమె గత కొన్ని ఏళ్లుగా అతడికి దూరంగా ఉంటూ పిల్లల బాగోగులు చూసుకుంటుంది.

మరో పెళ్లి చేసుకోవచ్చు.. కదా అని చాలామంది చెపుతున్నప్పటికీ ఎప్పుడు కూడా సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఈ మధ్య ఆమె పెళ్లి విషయం ఓ క్లారిటీ కి వచ్చిందని , తనకు సరిపడా ఓ వరుడిని సెలెక్ట్ చేసుకుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెకు కాబోయే భర్త ఐటీ కంపెనీ యజమాని అని, ఆయన కూడా ఇదివరకే విడాకులు తీసుకున్నారని వినికిడి. ఇప్పటి వరకూ పెళ్లి విషయాన్ని సునీత అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించలేదు. గత నెలలోనే సునీత నానమ్మ చనిపోయారు. సునీత ఇన్నాళ్లూ పిల్లలే ప్రాణంగా బతికారు. వాళ్లు పెద్దవాళ్లవడంతో సునీత మరో పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందట. మరి ఈ వార్త ఎంత వరకు నిజం అనేది ఆమెనే చెప్పాలి.