మళ్లీ తెరమీదకు పవన్ మొదటి హీరోయిన్..

పవన్ కళ్యాణ్ మొదటి సినిమా అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి లో హీరోయిన్ గుర్తుందా..అదేనండి అక్కినేని వారసురాలు సుప్రియ..ఈ చిత్రం తర్వాత మళ్లీ ఆమె ఏ చిత్రం లో నటించలేదు. ఒక్క సినిమాతోనే హీరోయిన్ గా బోర్ కొట్టేసి సినిమాలకు బై బై చెప్పేసింది. అలానీ సినిమా ఇండస్ట్రీ కి దూరం కాలేదు. కింగ్ నాగార్జున నిర్మించే చిత్రాలకు ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు చేపడుతూ ఉంటుంది. అలాగే అన్నపూర్ణ స్టూడియోస్ సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటుంది.

తాజాగా ఈమె దాదాపు 22 ఏళ్ల తర్వాత తెరపై కనిపించబోతుంది. అడవి శేష్ హీరోగా ‘గూడచారి’ సినిమా తెరకెక్కుతోంది. రాహుల్ పాకల, శశి కిరణ్ లు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తుండగా , అడవిశేష్ సరసన తెలుగమ్మాయి శోభితా దూళిపాల జోడి కట్టింది. అయితే ఈ సినిమాలో ఓ ముఖ్య రోల్ లో సుప్రియ నటించినట్లు తెలుస్తుంది. ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రను ఈమె పోషించిందట. గూఢచారిలో పాత్ర నచ్చడంతో.. తిరిగి తెరముందుకు వచ్చినట్టు సుప్రియ చెప్తోంది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. ఆగష్టు 3 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.