సెక్స్ గురించి నగ్నం హీరోయిన్ ఏంచెపుతుందో తెలుసా..?

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన నగ్నం సినిమా తో స్వీటీ (శ్రీ రాపాక) నెటిజన్లను ఆకట్టుకుంది. అమ్మడి అందాల ఆరబోతకు సినీ అభిమానులు , సినీ ప్రముఖులు ఫిదా అయ్యారు. తాజాగా యూట్యూబ్ చానెల్స్ కు వరుస ఇంటర్వ్యూ లు ఇస్తూ పలు విషయాలు తెలుపుతుంది. తాజాగా పెళ్ళికి ముందు సెక్స్ చేయొచ్చా లేదా అనేది తెలిపింది.

ఈమధ్య కాలంలో చాలా మంది లవర్స్.. పెళ్లికి ముందే సెక్స్‌లో పాల్గొంటున్నారు? ఇది ఎంత వరకూ కరెక్ట్ అనుకుంటున్నారు అని యాంకర్ స్వీటీని ప్రశ్నించడంతో ఓపెన్ అయ్యింది. ‘సెక్స్ అనేదాన్ని నేను చాలా పవిత్రంగా చూస్తాను.. ప్రపంచం మొదలైందే అక్కడ. ఒక పురుగు దగ్గర నుంచి మనుషుల వరకూ సెక్స్ లేకుండా లేదు. దాన్ని నేను బూతుగా చూడను. సెక్స్ అంటే డివైన్. పెళ్లికి ముందు సెక్స్ ఒకర్నొకరు అర్థం చేసుకోవడం కరెక్టా కాదా? అంటే నాకు ఒక విషయం చెప్తా. నాకు తెలిసిన మెడికల్ స్టూడెంట్ ఒక అమ్మాయికి వాళ్ల పేరెంట్స్ ఒక అబ్బాయిని చూసి ఎరేంజ్డ్ మ్యారేజ్ చేశారు. వాళ్ల ఫస్ట్ నైట్ రోజునే అతను మగాడు కాదని తెలిసింది. అతను గే. మెడిసిన్ చదివిన ఆ అమ్మాయికి ఇలాంటి పరిస్థితి వచ్చింది.

పెళ్లికి ముందే సెక్స్ చేయమని నేను చెప్పడం లేదు.. కాని పెళ్లి సెట్ అయ్యింది.. ఒకరితో ఒకరు జీవితం అనుకున్నప్పుడు ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకోవాలి. ఎక్కువ టైం కేటాయించుకోవాలి. అందులో నెగిటివ్ పాజిటివ్ ఏదైనా ఉండనివ్వండి. ఏదీ లేకుండా పెళ్లి కుదిర్చారు కదా అని వెళ్లి చేసుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. నేను పెళ్లిని గౌరవిస్తా.. ఎందుకంటే పెళ్లి అంటే ఇద్దరు మనుషుల మధ్య రిలేషన్ కాదు.. రెండు ఫ్యామిలీస్. పెళ్లికి ముందు సెక్స్.. తరువాత సెక్స్ అని కాదు… ఎప్పుడైనా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఒకరితో ఒకరు టైం కేటాయించుకోవడం తప్పేం కాదు. అలా టైం కేటాయిస్తే ఒకరిగురించి ఒకరికి తెలుస్తుంది. ఒకవేళ నేను వేరే రిలేషన్‌లో ఉన్నా.. ఏవైనా తెలుస్తుంది. ఒకరిపై ఒకరికి ఉన్న డౌట్స్ చాలా వరకూ క్లియర్ అవుతాయి’ అంటూ సెక్స్ గురించి చెప్పుకొచ్చింది.