‘సైరా’ టీజర్‌ టైం ఫిక్స్ …

మెగా అభిమానులు ఎప్పటినుండో ఎదురుచూస్తున్న సైరా టీజర్ కు ముహూర్తం పెట్టేసారు. ఆగష్టు 21న ఉదయం 11.30గంటలకు సైరా టీజర్ విడుదల కాబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన చేసి అభిమానులకు తీపి కబురు అందించారు. మెగాస్టార్ చిరంజీవి – సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘సైరా నరసింహ రెడ్డి’.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో వేసిన భారీ సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ లో విజయ్ సేతుపతి , నయనతార , జగపతి బాబు , బిగ్ బి అమితాబ్ , బ్రహ్మాజీ మొదలగు స్టార్ నటి నటులు నటిస్తున్న సంగతి తెల్సిందే. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్ర టీజర్‌కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. మెగాస్టార్ పుట్టినరోజు ఆగష్టు 22న కాగా.. ఒకరోజు ముందుగానే అభిమానులకు పుట్టినరోజు కానుక ఇవ్వబోతున్నాడు చిరంజీవి. ఈ చిత్రానికి అమిత్ త్రివేది సంగీతం అందిస్తున్నాడు.