తమన్నా లుంగీ లేపింది.. ఇక చూడాల్సిందే మీరే !

బాహుబలి తర్వాత తమన్నా సినిమాల జోరు బాగా తగ్గింది..గత ఏడాది గా ఈమెను పలకరించిన నాధుడే లేకుండా పోయాడు. ఇప్పుడిప్పుడే మళ్లీ తెలుగు , తమిళ్ అవకాశాలు తలుపు తడుతున్నాయి. తెలుగు లో ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్లో దిల్ రాజు నిర్మిస్తున్న ఎఫ్ 2 చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ నేపథ్యంలో తమిళంలో ఎప్పుడో వచ్చిన ఒక సినిమాను తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు.

ఆర్య , తమన్నా జంటగా నటించిన సినిమాను ఐశ్వర్యాభిమస్తూ పేరుతో తెలుగులో విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో విశాల్ గెస్ట్ రోల్ చేయడం తో ఈ సినిమాకు బాగా కలిసి వస్తుందని తెలుగు నిర్మాతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్రానికి సంబందించిన పిక్స్ ను బయటకు వదిలారు. తమన్నా లుంగీ డ్యాన్స్ పిక్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

స్పైసీ పిక్స్‌గా ఇవి వైరల్ అవుతున్నాయి. ఇది వరకూ ఆర్యతో వివిధ సినిమాలు తీసిన రాజేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మరి ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందనేది తెలియదు కానీ ఈ లుంగీ స్టిల్ మాత్రం తెగ చక్కర్లు కొడుతుంది.