తమన్నా కొత్త ఇల్లు ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా ఓ ఇంటిని కొనుగోలు చేసింది..కొనుగోలు అంటే లక్షల్లో కాదు కోట్లు పెట్టు కొనుగోలు చేయడం తో వార్తల్లో నిలిచింది. ముంబైలోని వెర్సోవా ప్రాంతం అంటే అత్యంత ఖరీదైన ఏరియా అని అందరికి తెలుసు..ఇక్కడ బాగా డబ్బున్న వారు..సినీ స్టార్స్ తప్ప సాధారణ ప్రజలు ఉండలేరు..ఇంటిని కొనుగోలు చేయలేరు. ఇప్పటికే ఈ ఏరియాలోని కొన్ని ఫ్లాట్ లను పలువురు సినీ స్టార్స్ కొనుగోలు చేయగా..తాజాగా తమన్నా ఓ ఫ్లాట్ ను భారీ ధర పెట్టి కొనుగోలు చేసినట్లు సమాచారం.

జుహు-వెర్సొవా లింక్ రోడ్‌లో ఉన్న ‘బేవ్యూ’ అనే 22 అంతస్తుల భవంతిలో 14వ అంతస్తులోని ఫ్లాట్‌ను రూ.16.60 కోట్లకు తమన్నా కొనుగోలు చేసిందట. ఇప్పటికే రిజిస్ట్రేషన్ కోసం స్టాంప్ డ్యూటీ నిమిత్తం రూ.99.60 లక్షలు బిల్డర్‌కు తమన్నా చెల్లించారని తెలుస్తుంది. ఈ ఫ్లాట్‌ను తమన్నా, ఆమె తల్లి రజనీ భాటియా పేర్ల మీద జాయింట్ వెంచర్‌గా కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ ఖరీదైన అపార్ట్‌మెంట్‌లో తమన్నా రెండు కార్ పార్కింగ్ స్లాట్స్‌ను కూడా కొనుగోలు చేశారట. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉన్న ధరలకు ఇది రెండు రెట్ల కంటే అధికమట. కానీ, బే వ్యూ చాలా బాగుండటంతో ఆ ఫ్లాట్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవడానికి డబుల్ రేట్‌ను తమన్నా చెల్లించినట్లు తెలుస్తుంది.