‘ ఆర్ ఎక్స్ 100 ‘ తమిళ్ రీమేక్ లో హీరోయిన్ ఎవరో తెలుసా..?

కార్తికేయ , పాయల్ రాజ్ పుత్ జంటగా నూతన దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ’ఆర్ఎక్స్ 100′. జులై 12న ప్రేక్షకులముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించింది. కేవలం రూ. 3 కోట్ల లోపు ఖర్చుతో నిర్మించబడిన ఈ మూవీ దాదాపు ఇప్పటి వరకు రూ. 13 కోట్ల పైచిలుకు షేరును రాబట్టి డబుల్ బ్లాక్ బ్లస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ చిత్ర రీమేక్ ఫై అన్ని ఇండస్ట్రీల కన్ను పడింది. అందులో భాగంగా తమిళ్ లో ఈ చిత్రం రీమేక్ అవుతుంది.

తెలుగు లో కార్తికేయ పోషించిన పాత్రను ఆదిపినిశెట్టి పోషిస్తుండగా , పాయల్ రాజ్ పాత్రలో అందాల తాప్సి నటించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఔరా సినిమా సంస్థ తమిళంలో నిర్మిస్తోంది. సెప్టెంబరులో షూటింగ్ ప్రారంభం కానుంది. గతంలో ఆది , తాప్సి జంటగా తెలుగులో ‘గుండెల్లో గోదారి’ చిత్రంలో కనిపించిన సంగతి తెలిసిందే. అలాగే వీరిద్దరూ నటించిన నీవరో త్వరలో విడుదల కానుంది. ఇప్పుడు ‘ఆర్‌ఎక్స్ 100’ తో మూడోసారి జత కలుస్తున్నారు.