తరుణ్ తో ఎన్టీఆర్..?

ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వం లో అరవింద సమేత చిత్రం చేస్తున్న , ఎన్టీఆర్ యంగ్ డైరెక్టర్ కు ఛాన్స్ ఇచ్చాడా..అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. పెళ్లిచూపులు 2016 లో ఎలాంటి అంచనాలు లేకుండా అంత కొత్తవారితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం..మొదటి షో తోనే హిట్ టాక్ సొంతం చేసుకోవడం , యూత్ ఈ చిత్రానికి బ్రహ్మ రధం పట్టడం తో ఈ సినిమా మాములు విజయం సాధించలేదు. నిర్మాతలకు కనక వర్షం కురిపించింది. ఈ మూవీ ని డైరెక్ట్ చేసిన తరుణ్ భాస్కర్ రాత్రి రాత్రికే స్టార్ డైరెక్టర్ అయిపోయాడు.

ప్రస్తుతం ఈ యువ ద‌ర్శ‌కుడు ‘ఈ నగరానికి ఏమైంది ?’ అనే చిత్రం వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కాగా తరుణ్ తాజాగా ఎన్టీఆర్ ని కలిసి తన సినిమా ప్రీమియర్ షోకి రావాల్సిందిగా కోరాడు. అయితే ‘ఈ నగరానికి ఏమైంది ?’తర్వాత తరుణ్ ఎన్టీఆర్ తోనే తన తర్వాత చిత్రాన్ని చేయనున్నాడని అంటున్నారు.

స్వర్గీయ రామానాయుడుగారు ఎన్టీఆర్ తో రాముడు – భీముడు చిత్రాన్ని రీమేక్ చేయాలనుకున్నారు. ఎన్టీఆర్ కూడా సినిమా చేస్తానని మాట ఇచ్చారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం పట్టాలెక్కలేదు. అయితే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కు జూ ఎన్టీఆర్ ఒక సినిమా చేయాల్సిన ఒప్పందం ఉంది. అదే విధంగా తరుణ్ భాస్కర్ తన తదుపరి చిత్రాలను కూడా సురేష్ ప్రొడక్షన్స్ లో చేస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ కారణంగా ఎన్టీఆర్ కు తరుణ్ కథ చెప్పనున్నారట. కథ నచ్చితే ఎన్టీఆర్ తో సినిమా గ్యారెంటీ అని అంత మాట్లాడుకుంటున్నారు. మరి ఎన్టీఆర్ కు నచ్చే కథ ను తరుణ్ సిద్ధం చేస్తాడా..లేదా అనేది చూడాలి.