మనసు మార్చుకున్న తేజ్..

సుప్రీమ్హీరో సాయి ధరమ్ తేజ్..కెరియర్ మొదట్లో వరుస హిట్లు అందుకొని మెగా అభిమానులను అలరించాడు. ఆతర్వాత వరుస ప్లాప్స్ పడేసరికి మనోడు న్యూమరాలజీ నమ్మాడో మరి దేనిని నమ్మాడో గాని చిత్రలహరి సినిమాకు తన పేరును సాయి తేజ్ గా మార్చుకున్నాడు. చిత్ర టైటిల్స్ లలో ..ప్రమోషన్ లలో అలాగే వేసుకున్నాడు.

దీంతో అంత తేజ్ పేరు మార్చుకున్నాడని..అలాగే కంటిన్యూ అవుతాడని అనుకున్నారు. కానీ నిన్న పూజా కార్య క్రమాలు జరుపుకున్న ‘ప్రతిరోజు పండగే’ సినిమా టైటిల్స్ లలో మాత్రం తేజ్ పేరు పాత పేరే అంటే సాయి ధరమ్ తేజ్ గానే ఉంటుందని అంటున్నారు.తేజు ట్విట్టర్ ఖాతాలో కూడా ‘సాయి ధరమ్ తేజ్’ అనే ఉంది. ఈ లెక్కన ‘సాయి తేజ్’ అనేది ఒక్క సినిమా ముచ్చటే అని అంత మాట్లాడుకుంటున్నారు.

మారుతీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ‘ప్రతిరోజు పండగే’ చిత్రంలో తేజ్ కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.