థమన్ దరువు మొదలు పెట్టాడు..


.
అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. పూజా హగ్దే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం రీసెంట్ గా మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకొని..త్వరలో సెకండ్ షెడ్యూల్ మొదలు పెట్టుకోబోతుంది. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్ అల్లు అర్జున్ తో సరైనోడు చిత్రం చేసాడు..అలాగే త్రివిక్రమ్ తో అరవింద సమేత చేసాడు. ఇలా ఇద్దరి తో ఒక్కో సినిమా చేసిన థమన్ ఇప్పుడు ఆ ఇద్దరితో కలిసి వర్క్ చేయబోతున్నాడు.

ఇదిలా ఉంటె, ఈ సినిమా కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టాడుథమన్. బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు థమన్ ట్రై చేస్తున్నాడని చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఫాథర్ సెంటిమెంట్ సినిమా కావడంతో ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడో చూడాలి. హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.