రాజమౌళి బాటలో త్రివిక్రమ్…

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శక ధీరుడు రాజమౌళి బాటలోకి వెళ్లాడా..అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. రాజమౌళి చేసే ప్రతి సినిమాలో వర్క్ షాప్ కండక్ట్ చేస్తాడు. ఎంత పెద్ద హీరోనైనా రిహార్సల్ చేయాల్సిందే. ఇప్పుడు ఇదే పద్దతికి త్రివిక్రమ్ కూడా చుట్టినట్లు తెలుస్తోంది. మూడు నాలుగు రోజుల షాట్ లు అన్నీ ఒకేసారి రెడీ చేసుకుని, వన్ డే వర్క్ షాప్ ఏర్పాటు చేసి, ఫుల్ గా రిహార్సల్ చేయిస్తున్నారట.

ప్రస్తుతం త్రివిక్రమ్.. బన్నీ సినిమాకు ఇదే పద్దతి పాటిస్తున్నారు. బన్నీ కూడా రిహార్సల్ కు హాజరవుతున్నారు. ఇక మిగిలిన కాంబినేషన్ ఆర్టిస్టుల సంగతి చెప్పనక్కరలేదు. ఈ పద్ధతి ద్వారా షూటింగ్ లకు ఎలాంటి బ్రేక్ లేకుండా అనుకున్న విధం గా ఆర్టిస్ట్ ల దగ్గరి నుండి కావలసిన అవుట్ దక్కించుకోవచ్చు.