పద్దతి మార్చుకున్న త్రివిక్రమ్

త్రివిక్రమ్ సినిమానే కాదు ఆయన సినిమా షూటింగ్ కూడా భలే సరదాగా వుంటుంది. అందరికీ ఓ పిక్నిక్ ఎట్మాస్పియర్. అందుకే త్రివిక్రమ్ సినిమా అంటే మరో ఆలోచన లేకుండా కాల్ సీట్లు సర్ధేస్తారు. అయితే సినిమా తీత విషయంలో మాత్రం ఆయన మీద ఒక కంప్లైంట్ వుంది. షూటింగ్ ని మరీ సాగదీస్తారని, అందుకే షూటింగ్ దినాలు పెరుగుతూ పోతుంటాయని చెబుతారు. దీనికి కారణం.. సీన్స్ ని ముందుగా ప్రిపేర్ చేయకపోవడం.

ఇప్పుడు త్రివిక్రమ్ కూడా ఈ సంగతి గ్రహించారు. అందుకే తన పద్దతి మార్చారు. ఇప్పుడు ఆయన వర్క్ షాపులు నిర్వహిస్తున్నారు. మూడు నాలుగు రోజుల షాట్ లు అన్నీ ఒకేసారి రెడీ చేసుకుని, ఒకరోజు వర్క్ షాప్ ఏర్పాటు చేసి, ఫుల్ గా రిహార్సల్ చేయిస్తున్నారట. రిహార్సల్ అయిన తర్వాత చకచకా షూట్ జరిగిపోతుంది త్రివిక్రమ్ ప్రస్తుతం చేస్తున్న బన్నీ సినిమాకు ఇదే పద్దతి పాటిస్తున్నారు. దీని ద్వార షూటింగ్ వేగంగా అవ్వడమే కాకుండా సీన్ పై నటీనటులకు ఇంకా క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.