యూ టర్న్ టాక్…సామ్ ఖాతాలో మరో హిట్

వరుస విజయాలతో ఫుల్ స్వింగ్ లో ఉన్న అక్కినేని కోడలు సమంత..తాజాగా యూ టర్న్ అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో ఈరోజు తెలుగు , తమిళ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కన్నడ లో సూపర్ హిట్ అయినా ఈ చిత్రాన్ని తెలుగు , తమిళ్ భాషల్లో పవన్ కుమార్ తెరకెక్కించడం జరిగింది. సమంత జర్నలిస్ట్‌గా కనిపించనుండగా.. ఆది పినిశెట్టి ఇన్వెస్టిగేషన్ అఫీసర్‌గా నటించారు. భూమిక, రాహుల్ రవీంద్రన్ ముఖ్య పాత్రల్లో నటించారు.

తెలుగు రాష్ట్రాల్లో విడుదలకు ముందే ఓవర్సీస్ ఈ చిత్ర ప్రీమియర్స్ షోస్ పడడం జరిగింది. ఈ షో చూసిన అభిమానులు , ప్రేక్షకులు సినిమా ఎలా ఉందనేది సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. సినిమా చాల బాగుందని , సినిమా స్టార్ట్ అయినా దగ్గరి నుండి ఎండ్ అయ్యేంత వరకు కూడా సస్పెన్సు గా సాగిందని , సమంత మరోసారి తన నటన తో ఆకట్టుకుందని చెపుతున్నారు.

పూర్ణచంద్ర తేజ‌స్వి బ్యాక్ గ్రౌండ్, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ హైలైట్ గా ఉందని ,నిర్మాణ విలువలు సైతం బాగున్నాయని చెపుతున్నాడు. సినిమాలో సమంత తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడమే కాకుండా చిత్ర నిర్మాణంలోనూ భాగస్వామి కావడం విశేషమని అంటున్నారు.