పుష్ప లో ఊర్వశి..?

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో పుష్ప మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందు మొదటి షెడ్యూల్ జరుగగా..ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చి షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో షూటింగ్ ను స్టార్ట్ చేసారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని మారేడుమిల్లి అరణ్యంలో చిత్రీకరణ జరుగుతోంది. అల్లు అర్జున్‌తో పాటు చిత్ర ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని స్పెషల్ సాంగ్ లో బాలీవుడ్‌ బ్యూటీ ఊర్వశి రౌటెలా ను ఎంపిక చేశారట.

ఇక ఈ సినిమాలో మొదట తమిళ హీరో విజయ్‌ సేతుపతి ఓ పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించాలి. కానీ కరోనా కారణంగా షెడ్యూల్స్ అన్ని మిస్ అయి.. డేట్స్ అన్ని క్రాస్ అయి మొత్తానికి విజయ్ సేతుపతి ఈ సినిమా నుండి తప్పుకున్నాడు. ఇప్పుడు ఈ పాత్ర కోసం విజయ్ సేతుపతి లాంటి మరో హీరో కోసం పుష్ప టీమ్ వెతుకులాట మొదలెట్టింది. మరి విజయ్ సేతుపతి లాంటి హీరో.. పైగా తమిళం లాంటి భాషలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరో దొరకడం అంటే కష్టమే.