పవన్ కెరియర్ లో అరుదైన రికార్డు

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ చిత్రం తో రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు. సంక్రాంతి కానుకగా చిత్ర ఫస్ట్ లుక్ టీజర్ ను రిలీజ్ చేసి అభిమానుల్లో సంతోషం నింపారు. సాలిడ్ రెస్పాన్స్ ను అందుకున్న ఈ టీజర్ ఇప్పటికీ కూడా స్ట్రాంగ్ గా నిలబడడం విశేషం. వ్యూస్ పరంగా పేలవమైన రెస్పాన్స్ నే అందుకున్నా లైక్స్ మరియు ట్రెండింగ్ లో మాత్రం పవన్ కెరీర్ లోనే అత్యధికంగా నిలిచింది.

గత 90 గంటలకు పైగానే యూట్యూబ్ లో ఈ టీజర్ నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతూ వస్తుంది. అంతే కాకుండా మన టాలీవుడ్ లోనే మోస్ట్ లైక్డ్ సెకండ్ టీజర్ గా కూడా నిలిచింది.