పవన్ కోసం వర్మ దెయ్యం కాబోతున్నాడు..

రామ్ గోపాల్ వర్మ vs పవన్ కళ్యాణ్ కాంబో వార్తల్లో ఎప్పుడు నిలుస్తూనే ఉంటుంది. వర్మ ఎన్ని కామెంట్స్ చేసిన పవన్ పెద్దగా పట్టించుకోడు.. కానీ అభిమానులు మాత్రం ఆలా సైలెంట్ గా ఉండరు. వర్మ చేసిన ప్రతిసారి ఘాటైన రిప్లై ఇస్తుంటారు. తాజాగా వర్మ అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ గురువారం విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ మూవీ పవన్ జనసేన పార్టీ వర్మ కొన్ని సెటైర్లు వేశారు..మిగత వారితో పోలిస్తే పవన్ ను తక్కువగానే చూపించాడు. అయితే ఈ సన్నివేశాల పట్ల జనసేన కార్య కర్తలు , అభిమానులు మండిపడుతున్నారు. తాజాగా వర్మ కు శ్రద్ధాంజలి ఘటిస్తూ ప్లెక్సీ ఏర్పటు చేసారు.

శ్రద్ధాంజలి

జోహార్ ది బాస్టర్డ్ ..
నీ ఆకస్మిక మరణం మాకు తీరని లోటు కలిగించాలని
నీ ఆత్మకు ఎట్టి పరిస్థితుల్లో శాంతో చేకురాకూడదని
భగవంతుణ్ణి ప్రార్థిస్తూ

ఇట్లు

కుటుంబ సభ్యులు
జనసేన కార్య కర్తలు

అంటూ వర్మ ఫై ప్లెక్సీ ఏర్పటు చేసారు. ఈ ప్లెక్సీ నీ వర్మ తన ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేసి ..మీ లీడర్ నీ దెయ్యమై పట్టుకోవడానికి ఆత్మగా త్వరలో వస్తున్న అంటూ రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది.