పాక్ ప్రధానికి చెమటలు పట్టించిన వర్మ..

వివాదాస్పద డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న రామ్ గోపాల్ వర్మ..ఎక్కువగా ట్విట్టర్ ద్వారానే స్పందిస్తూ ఉంటాడు..సోషల్ మీడియా ను వేదికగా చేసుకుంటూ సంచలనాలు సృష్టిస్తుంటాడు..అది సినిమాల గురించైనా, వ్యక్తుల గురించైనా..ఇక ఎప్పుడు వివాదాస్పద ట్వీట్లే కాదు అప్పుడప్పుడు కొన్ని ఆలోచింప చేసే ట్వీట్లు కూడా చేస్తుంటాడు. తాజాగా అలాంటి ట్వీట్లే చేసి వార్తల్లో నిలిచారు.

ఫిబ్రవరి 14 న జమ్ముకాశ్మీర్‌లోని పుల్వామాలో జైష్ ఏ మహ్మద్ ఉగ్రదాడిలో 49కి పైగా సీఆర్‌పీఎఫ్ జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిపై ప్రతి ఒక్కరు మండిపడ్డారు. సైలెంట్ గా ఉంటె పనికిరాదని పాక్ కు త్వరగా బుద్ది చెప్పాలంటూ అంత కోరుకున్నారు. ఈ నేపథ్యంలో వర్మ..పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను ట్విట్టర్ వేదిక గా ఉతికి ఆరేసాడు.

ప్రియమైన ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌‌కు..

* సమస్యలు ఒక్క మాటతో పరిష్కారమైతే..మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు.

* ఒక వ్యక్తి టన్నుల కొద్ది ఆర్డీఎక్స్‌తో తమ వైపు పరిగెత్తుకొస్తున్నపుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా భారతీయులకు నేర్పండి..కావాలంటే మీకు నేను ట్యూషన్ ఫీజు కూడా ఇస్తానంటూ సెటైర్ వేసాడు.

* ఒసామా బిన్ లాడెన్ లాంటి వ్యక్తి మీ దేశంలో ఉన్నాడని అమెరికాకు తెలుస్తోంది. కానీ మీకు తెలియదు.
అసలు పాకిస్థాన్ ఒక దేశమేనా ? చెప్పండి సార్..ఓ మొద్దు భారతీయుడు అడుగుతున్నాడు.మాకు కొంచెం తెలివితేటలు ఇవ్వండి అంటూ ట్వీట్ చేసాడు.

* జైష్ ఏ మహ్మద్, లష్కర్ ఏ తొయిబా, తాలిబన్, అల్ ఖైదా మీ ప్లే స్టేషన్లు అని నాకు ఎవరు చెప్పలేదు. కానీ మీకు వాటిపై ప్రేమ లేదన్న విషయాన్ని అంగీకరించలేదున్నాడు.

* జైష్ ఏ మహ్మద్, లష్కర్ ఏ తొయిబా, తాలిబన్, ఆల్ ఖైదా మీరు బంతులుగా భావించి..పాకిస్థాన్ బౌండరీలు దాటిస్తూ..ఇండియా పెవిలియన్‌కు పంపుతున్నారు. కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా ? లేదా బాంబ్స్ అనుకుంటన్నారా లేదా చెప్పండి సార్ అంటూ తనదైన ప్రశ్నలతో చెమటలు పట్టించారు. ప్రస్తుతం వర్మ చేసిన ట్వీట్స్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది.