వరుణ్ తేజ్ చేతికి ప్రభాస్ మూవీ..

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్..రీసెంట్ గా గద్దలకొండ గణేష్ తో సూపర్ హిట్ కొట్టి మెగా అభిమానులు అలరించారు. ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరెక్షన్లో బాక్సింగ్ నేపథ్యంలో ఓ మూవీ చేయబోతున్నాడు. అయితే ఈ మూవీ కంటే ముందు సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఓ మూవీ చేయబోతున్నాడని లేటెస్ట్ కబురు.

సైరా తో సూపర్ హిట్ అందుకున్న సూరి..రీసెంట్ గా ప్రభాస్ కు ఓ స్టోరీ వినిపించాడట. స్టోరీ ప్రభాస్ కు బాగా నచ్చినప్పటికీ డేట్స్ ఖాళీ లేకపోవడం తో సూరి కి నో చెప్పాడట. దాంతో సూరి అదే కథను వరుణ్ కు చెప్పడం తో బాగా నచ్చి వెంటనే తన డేట్స్ ఇచ్చేశాడట. మరి నిజంగా సూరి మూవీ ని ముందు సెట్స్ పైకి తీసుకొస్తాడో..లేక కిరణ్ మూవీ ని తీసుకొస్తాడో చూడాలి.