వెంకీమామ లేటెస్ట్ షూటింగ్ అప్డేట్..

నాగ చైతన్య – వెంకటేష్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం వెంకీమామ. జై లవకుశ ఫేమ్ బాబీ డైరెక్షన్లో సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా బ్యానర్లపై తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మధ్యనే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్..ప్రస్తుతం రెండోవ షెడ్యూల్ ను హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో మొదలు పెట్టుకుంది.

ఈ షెడ్యూల్లో వెంకీ , చైతూ అలాగే ఇతర తారాగణం ఫై కొన్ని ఫ్యామిలీ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దీనితర్వాతి షెడ్యూల్ కూడా హైదరాబాద్ లోనే జరుగనుంది. సుమారు 15రోజుల పాటు జరుగనున్న ఈ షెడ్యూల్ లో ఒక సాంగ్ తో పాటు కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ చిత్రంలో వెంకీ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ అలాగే నాగ చైతన్య కు జోడిగా రాశి ఖన్నా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్నాడు.