వెంకీమామ వరల్డ్ వైడ్ గ్రాస్ కుమ్మేసాడు..

తెలుగు చిత్ర సీమలో క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన చిత్రం వెంకీమామ. వెంకటేష్, నాగచైతన్య మామ అల్లుళ్ళుగా నటించారు. నిజజీవితంలో మామఅల్లుళ్ళు అయిన వెంకటేష్, నాగచైతన్య ఈ సినిమాలో కూడా అవే రోల్స్ ప్లే చేస్తుండడంతో తో సినిమా ఫై విపరీతమైన అంచనాలు ఏర్పడ్డాయి.

ఈ మూవీ లో వెంకటేశ్ రైతుగా, నాగచైతన్య ఆర్మీ ఉద్యోగిగా కనిపించనున్నారు. వెంకీ సరసన పాయల్ రాజ్‌పుత్, చైతూకు జోడీగా రాశీ ఖన్నా నటిస్తున్నారు. కీలక పాత్రల్లో రావురమేశ్, నాజర్, ప్రకాశ్‌రాజ్ అలరించారు. ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్‌లో నిర్మాత సురేశ్ బాబు నిర్మించగా దర్శకుడు బాబీ తెరకెక్కించారు. అంచనాలకు తగ్గట్లే సినిమా ఉండడం తో అభిమానులు , ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మ రధం పడుతున్నారు. ఇక ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా 16 .5 కోట్ల గ్రాస్ సాధించినట్లు అధికారిక ప్రకటన చేసారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడం తో రాబోయే రోజుల్లో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.