మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రం ఫై విజయ్ దేవరకొండ స్పందన

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా దొరసాని చిత్రం తో ఇండస్ట్రీ కి పరిచమైన సంగతి తెలిసిందే. మంచి అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. తాజాగా ఆనంద్ త‌న రెండో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

భ‌వ్య క్రియేష‌న్స్ బేన‌ర్‌లో ఆనంద్ త‌న రెండో సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్ చేసారు. ఈ మూవీని వినోద్ అనంతోజు అనే ఓ నూతన దర్శకుడు. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులును బాగా మెప్పించింది. ఈ సినిమాకి మంచి రివ్యూలు, ప్రశంసలు దక్కడంతో విజయ్ దేవరకొండ తన ఆనందాన్ని ఓ లెటర్ ద్వారా తెలియజేశాడు. విజయ్ దేవరకొండ ఈ రోజు సోషల్ మీడియాలో తన తమ్ముడు రెండో చిత్రం గురించి పెద్ద లెటర్ పోస్ట్ చేశాడు.

లెటర్ లో “మిడిల్ క్లాస్ మెలోడీస్” సినిమా తీసిన దర్శకుడు వినోద్ ని అతని దర్శకత్వ పనితనాన్ని విజయ్ బాగా మెచ్చుకున్నాడు. అలాగే, ఈ సినిమా డైలాగ్ రైటర్ జనార్దన్ గురించి, ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర పోషించిన గోపరాజు రమణ నటన గురించి.. ఇక హీరోయిన్ వర్ష బొల్లమ్మ గురించి విజయ్ ప్రత్యేకంగా ప్రస్తావించి ప్రశంసలు కురిపించాడు.