కూతురి ఫై కేసు పెట్టిన సీనియర్ నటుడు..

స్నేహం కోసం , వాసు , తమ్ముడు , నేను శైలజ మొదలగు తెలుగు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన సీనియర్ నటుడు విజయ్ కుమార్ తాజాగా తన కూతురు వనిత ఫై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. వివరాల్లోకి వెళ్తే

మధురవోయిల్, అలపాక్కమ్‌లోని అష్టలక్ష్మి నగర్‌లో విజయ్ కుమార్‌కి ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటిని అద్దెకు ఇస్తూ, విజయ్ కుమార్ తన కుమారుడు అరుణ్‌తో కలిసి కొట్టివాక్కమ్‌లో నివాసం ఉంటున్నాడు. కూతురు అడిగిందని షూటింగ్ కోసం ఇంటిని అద్దెకు ఇచ్చాడు. కానీ, షూటింగ్‌ పూర్తయినా ఇంటిని వనిత తనకు తిరిగి అప్పగించడం లేదని విజయ్ చెబుతున్నారు. తన ఇంటిని అప్పజెప్పాలని అడిగితో కూతురు వనిత రౌడీలతో బెదిరింపులకు దిగుతుందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. విచారణ చేపట్టిన పోలీసులు వనితను ప్రశ్నించారు. ఆ ఇంట్లో తనకు కూడా వాటా ఉందని, అందుకే ఖాళీ చేయడం లేదని వనిత చెప్పింది. మీకు వాటా ఉందనడానికి ఆధారాలు చూపించాలని పోలీసులు అడిగితే వారితోనూ వాగ్వాదానికి దిగింది. ప్రస్తుతం వనిత ఫై పోలీసులు సీరియస్ గా ఉన్నారు.

విజయ్ కుమార్ కు ఐదుగురు కూతుళ్లు, ఓ కుమారుడు.. కాగా, గత కొంతకాలం నుంచి వనిత, విజయ్ కుమార్‌ల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ ఇల్లు విషయంలోనే గొడవలు జరుగుతున్నట్లు అక్కడి స్థానికులు చెపుతున్నారు.