అసలు ఆర్ ఎక్స్ హీరో విజయేనట..

ఆర్ ఎక్స్ 100 చిత్రంతో కార్తికేయ యూత్ కు బాగా దగ్గర అయినా సంగతి తెల్సిందే. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ మూవీ లో కార్తికేయ సరసన పాయల్ రాజ్ పుత్ నటించింది. ఈ ముగ్గురి కెరియర్ కు ఈ సినిమా చాల హెల్ప్ అయ్యింది. తాజాగా ఈ మూవీ విడుదలై రెండేళ్లు గడుతున్న సందర్భాంగా అజయ్ ఈ మూవీ గురించి చెప్పుకొచ్చారు.

ఆర్ ఎక్స్ 100 మూవీ స్క్రిప్ట్ మొదట హీరో విజయ్ దేవరకొండ దగ్గరికి వెళ్లిందట. ఈ విలేజ్ ట్రాజిక్ లవ్ స్టోరీపై విజయ్ దేవరకొండ ఎందుకో ఆసక్తి చూపించలేదట. దీనితో ఈ కథను హీరో కార్తికేయతో చేసి ఆయన బంపర్ హిట్ కొట్టారు. కార్తికేయ రెండో చిత్రంగా వచ్చిన ఈ మూవీ ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది.