కురు వృద్దుడిగా విజయ్..

విజ‌య్ సేతుప‌తి..ఈ పేరు చెపితే విభిన్న చిత్రాలు గుర్తుకొస్తాయి..అందరిలా మూస కథలు కాకుండా ప్రేక్షకులకు కొత్తదనం ఉండేలా కథలను ఎంచుకుంటూ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త విజయాలను నమోదు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు. విజయ్ నుండి సినిమా అంటే చాలు కొత్తదనం ఖచ్చితంగా ఉంటుందని అంత ఫిక్స్ అయిపోతారు. ప్రస్తుతం ఈయన తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహ రెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ చిత్రంలో బ్రిటీష్‌ వారి దగ్గర సిపాయిగా పనిచేసే భారతీయుడిగా విజయ్ కనిపిస్తాడని సమాచారం. ఇక సినిమా తో పాటు తమిళంలో ఓ ఛాలెంజింగ్ పాత్ర చేస్తున్నాడు.

సీతాకాతి అనే సినిమా కోసం విజ‌య్ కురు వృద్దుడిగా క‌నిపించ‌నున్నాడు. బాలాజీ తరీంతరన్ దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కుతుండ‌గా, తాజాగా ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ విడుద‌లయ్యాయి. ఇందులో విజ‌య్ లుక్ చూసి అంత షాక్ అవుతున్నారు. గోవింద్ పి మేనన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, న‌వంబర్‌లో మూవీ రిలీజ్‌కి స‌న్నాహాలు చేస్తున్నారు.