స్టేజ్ ఫై రొమాంటిక్ గా డాన్స్ చేసిన గీత – గోవిందం..

గీత గోవిందం చిత్రం తో రొమాంటిక్ పెయిర్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ – రష్మిక..తాజాగా రేడియోమిర్చి అవార్డ్స్ లో స్టేజి ఫై రొమాంటిక్ డాన్స్ చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. హోస్ట్ గా వ్యవహరిస్తున్న వారు విజయ్ – రష్మిక లను ఒక పాటకు డ్యాన్సు చేయమని కోరగా.. ఒక కన్నడ సాంగ్ ను బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేయడం జరిగింది. ఈ సాంగ్ కు విజయ్ – రష్మిక లు రొమాంటిక్ స్టెప్ వేశారు.

రష్మిక ను చూసి కాస్త భయపడ్డారో ఏమో గానీ సిగ్గుపడుతూ విజయ్ డ్యాన్స్ వేయడం కొత్తగా అనిపించింది. రష్మిక మాత్రం తన ఛార్మింగ్ స్టైల్ లో నవ్వుతూ విజయ్ తో కలిసి స్టెప్పేసింది.

ఇటీవలే విజయ్ దేవరకొండ నోటా చిత్రం తో తెలుగు , తమిళ్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా విజయ్ కి చేదు అనుభవాన్ని మిగిల్చింది. పొలిటికల్ నేపథ్యం లో ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. ప్రస్తుతం విజయ్ డియర్ కామ్రేడ్ , టాక్సీవాలా చిత్రాలతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.