విజయ్ సేతుపతి చిన్న కూమార్తెపై అత్యాచార బెదిరింపులు

తమిళ నటుడు విజయ్ సేతుపతి చిన్న కూమార్తెపై సోషల్‌ మీడియాలో అత్యాచార బెదింపులు రావడం సంచలనంగా మారింది. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ముత్తయ్య మురళీధరన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. తన స్పిన్ మాయాజాలంతో మహా మహా బ్యాట్స్ మెన్ ను సైతం బోల్తా కొట్టించి .. పెవిలియన్ కి పంపిన ఘనత అతనిది. బౌలర్ గా ఎన్ని రికార్డ్స్ సాధించాడు. అలాంటి గొప్ప క్రికెటర్ జీవిత కథను సినిమా రూపంలో తెరకెక్కించబోతున్నారు.

ఈ చిత్రానికి ‘800’ అనే టైటిల్ని నిర్ణయించినట్టు సమాచారం. మురళీధరన్ అంతర్జాతీయ క్రికెట్లో 800 వికెట్లు తీసిన వైనానికి సంకేతంగా దీనికి ఆ టైటిల్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. దార్ మోషన్ పిక్చర్స్ తో కలసి సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మించే ఈ చిత్రానికి ఎమ్మెస్ శ్రీపతి దర్శకత్వం వహించబోతున్నాడు. అయితే ఈ సినిమాలో మురళీధరన్ పాత్రలో తమిళ నటుడు, కథానాయకుడు విజయ్ సేతుపతి నటిస్తున్నాడనే ప్రకటన వచ్చినప్పటి నుండి విజయ్ కి తమిళనాట అసమ్మతి సెగ మొదలైంది. ఎట్టిపరిస్థితుల్లో ఈ బయోపిక్ లో నటించకూడదని పెద్ద ఎత్తున నిరసనలు రావడం తో ఈ సినిమా నుండి విజయ్ తప్పుకున్నాడు.

ఇక ఈ ప్రాజెక్టు నుంచి విజయ్‌ సేతుపతి తప్పుకున్న కొన్ని గంటలకే ఆయన చిన్న కూమార్తెపై సోషల్‌ మీడియాలో అత్యాచార బెదింపులకు పాల్పడుతున్నారు. విజయ్‌ సేతుపతి ట్వీట్‌కు సమాధానమిస్తూ.. తన కూమార్తెపై అఘాయిత్యానికి పాల్పడతామని, అలా చేస్తేనే ఈలం తమిళుల బాధ ఎలా ఉంటుందో నటుడికి అర్థం అవుతుందని అని పేర్కొన్నారు. అయితే ఈ ట్రోల్‌పై అనేకమంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ వైరల్‌ అవ్వడంతో సదరు నెటిజన్‌ ప్రవర్తనను ఖండిస్తున్నారు.