ఈ రెండు సినిమాలపై విజయ్ కి నమ్మకాల్లేవా ?


”ఎవడే సుబ్రహ్మణ్యం” సినిమాతో విజయ్ దేవర కొండ అనే ఓ నటుడు వున్నాడని ప్రేక్షకులకు తెలిస్తే.. ”పెళ్లి చూపులు’ సినిమాతో ఆ పేరు మార్మ్రోగిపోయింది. ఈ సినిమాతో యువస్టార్ హీరోల లిస్టు లోకి వచ్చాడు విజయ్. అయితే ”అర్జున్ రెడ్డి” సినిమా విజయ్ గ్రాఫ్ ని మార్చేసింది. ఒక్కసారిగా వందమెట్లు ఎక్కించిందీ సినిమా. ఈ సినిమాతో యూత్ మెగాస్టార్ అయిపోయాడు విజయ్ దేవరకొండ. వరుసగా ఇలా రెండు హిట్లతో దూసుకొచ్చిన విజయ్ కి ”గీత గోవిందం” హ్యాట్రిక్ ని ఇచ్చింది. మామూలు హ్యాట్రిక్ కాదు ఒక విధంగా బంపర్ హ్యాట్రిక్ అనుకోవాలి. ఏకంగా వందకోట్లు వసుళ్ళూ సాధించిన ఈ సినిమా విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అర్జున్ రెడ్డి తో ట్రెండ్ సెట్టర్ గా నిలిస్తే గీత గోవిందంతో వందకోట్ల హీరో అయ్యాడు విజయ్.

అయితే ఇప్పుడు విజయ్ నుండి మరో రెండు సినిమాలు రావడానికి రెడీగా వున్నాయి. ఒకటి ”నోటా” రెండు ”ట్యాక్సీవాలా”. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలపై ఫిల్మ్ నగర్ సర్కిల్స్ లో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. పెళ్లి చూపులు తర్వాత ”ద్వారక” అనే సినిమా ఒకటి చేశాడు విజయ్. ఈ సినిమా ఎప్పుడు వచ్చి ఎప్పుడు వెళ్లిందో తెలీదు. అర్జున్ రెడ్డికి ముందు ఒప్పుకున్న సినిమా ఇది. అప్పటికీ తన క్రేజ్ వేరు. అర్జున్ రెడ్డి తర్వాత గ్రాఫ్ మారిపోయింది. అయితే ఈ నోటా, ట్యాక్సీవాలా కూడా ద్వారక సినిమా సమయంలో ఒప్పుకున్నవేనట. ట్యాక్సీవాలా చాలా రోజులుగా ఎడిటింగ్ రూమ్ లోనే వుండిపోయింది. ఈ సినిమాని ఒక దశలో డైరెక్ట్ గా అమోజన్ ప్రైమ్ లో విడుదల చేసేయాలని ఒక దశలో వినిపించింది. కానీ మళ్ళీ ఆగారు. ఇప్పుడు నోటా ముందుకు తీసుకొచ్చారు. దీనిపై కూడా విజయ్ అంత హ్యాపీగా లేడని అంటున్నారు.

సినిమా స్క్రిప్ట్ చాలా వరకు నేల విడిచిసాము చేసినట్లు ఉటుందని భోగట్టా. ఆ మధ్య ”ఏం మాత్రం వేసావే’అనే ఓ సినిమా వచ్చింది. అప్పుడెప్పుడో హీరో ప్రయత్నాలు చేస్తున్నపుడు విజయ్ చేసిన సినిమా ఇది. అర్జున్ రెడ్డి తర్వాత విడుదలకు నోచుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా పాల్గోలేదు విజయ్. పైగా దాన్ని ”బ్యాక్ లాగ్ సబ్జెక్ట్” తో పోల్చి ఓ ట్వీట్ చేశాడు. ఇప్పుడు బయటికి చెప్పకపోయిన నోటా, ట్యాక్సీవాలా సినిమాల విషయంలో కూడా విజయ్ ఫీలింగ్ ఇదేనని ఇన్సైడ్ టాక్.