వినయ విధేయ రామ టాక్…’కొణెదల’ రికార్డ్స్ రాసుకోండి

సంక్రాంతికి పెద్ద హీరోల సందడి ఉందంటే ఆ మజానే వేరు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సంక్రాంతి సినిమాలు థియేటర్స్ వద్ద సందడి చేస్తున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్ కథానాయకుడు, పేట చిత్రాలు సందడి షురూకాగా.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ చిత్రం భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గత ఏడాది ‘రంగస్థలం’ సినిమాతో తెలుగు హిస్టరీ రికార్డ్స్‌ని బ్రేక్ చేసిన రామ్ చరణ్..ఇప్పుడు మాస్ అండ్ ఫ్యామిలీ యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘వినయ విధేయ రామ’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మెగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అమెరికా లో చిత్ర ప్రీమియర్స్ షో చూసిన వారంతా సినిమా అదిరింది, చరణ్ కు అసలు సిసలైన యాక్షన్ పడితే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే అర్ధం అవుతుంది. మెగా అభిమానులు కోరుకునే అసలైన యాక్షన్ ప్యాక్ ఇదే అంటున్నారు.

రామ్ కొ.. ణె.. ద.. ల అంటూ సిక్స్ ప్యాక్‌ ఉగ్రరూపం చూపించాడు. డాన్స్, ఫైట్స్, యాక్షన్ ఇలా అన్నింట్లో చరణ్ చించేసాడు. ఇక బోయపాటి సైతం తనదైన యాక్షన్ చూపించి ఆకట్టుకున్నాడు. కియారా మరోసారి తన గ్లామర్ తో ఆకట్టుకుంది. డాన్సులతో చరణ్ తో పోటీ పడి చేసి ఆకట్టుకుంది. స్నేహ, ఆర్యన్ రాజేష్, వివేక్ మొదలగు స్టార్స్ అంత అదరగొట్టారని చెపుతున్నారు. కానీ దేవి శ్రీ నిరాశ పరిచాడని, ఓవరాల్ గా ఏ సెంటర్ లలో కాస్త మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ బి,సి సెంటర్లలో కుమ్మేయడం ఖాయం.