ఓ రోజు ముందే సినిమా చూపించబోతున్న విశాల్…

విశాల్‌ , కీర్తి సురేష్ , వరలక్ష్మి జంటగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘సండకోళి 2’ ( తెలుగు లో పందెంకోడి 2 ). 13 సంవత్సరాల క్రితం లింగుస్వామి – విశాల్ కలయికలో వచ్చిన ‘పందెంకోడి’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్రం విశాల్ కు 25వ సినిమా కావడం, లింగుస్వామి డైరెక్షన్లో సినిమా రావడం తో ఈ మూవీ ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఈ సందర్బంగా విశాల్ చిత్ర విడుదలకు ఓ రోజు ముందు అనగా అక్టోబర్ 17 న తమిళ నాడు వ్యాప్తంగా ఈచిత్రాన్ని ప్రదర్శించనున్న థియేటర్ల ఓనర్స్ కి స్పెషల్ స్క్రినింగ్ లో ఈచిత్రాన్ని చూపెట్టడానికి సిద్ధం అవుతున్నాడు. దీని బట్టి అర్ధం చేసుకోవచ్చు విశాల్ ఈ సినిమా ఫై ఎంత కాన్ఫిడెంట్ గా వున్నాడని.

లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు.