‘వినయ విధేయ రామ’ మలయాళం లో ఎలా అదరగొడుతుందో తెలుసా ..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెలుగులో వచ్చిన చిత్రం ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి బరిలో భారీ అంచనాల ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది. చరణ్ కెరియర్ లో మరో డిజాస్టర్ గా ఖాతాలోకి చేరింది. రీసెంట్ గా ఈ సినిమాను ఫిబ్రవరి 08 న మలయాళం లో విడుదల చేసారు.

మలయాళం లో మన తెలుగు హీరోలకు మంచి రెస్పాన్స్ వస్తుండడం తో చరణ్ సినిమాను అక్కడ రిలీజ్ చేసారు. ఈ చిత్రం శుక్రవారం 10.60 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, శనివారం 8 .90 లక్షలు , ఆదివారం 9.10 లక్షల గ్రాస్ ను కలెక్ట్ చేసి మూడు రోజులకుగాను రూ. 28.60 లక్షల గ్రాస్ ను 11.50 లక్షల షేర్ ను రాబట్టి పర్వాలేదు అనిపిస్తుంది. మరి వీకెండ్ కాబట్టి ఆలా వసూళ్లు వచ్చాయి..తదుపరి రోజుల్లో ఎలా రాబడుతుందో చూడాలి.

ఇక తెలుగు సంగతికి వస్తే..ఈ సినిమా వల్ల నష్టపోయిన బయ్యర్లను నిర్మాత దానయ్య తో పాటు చరణ్ ఆదుకుంటున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటించగా వివేక్ ఒబేరాయి విలన్ రోల్ లో నటించారు.