పోల్ : ‘ వినయ విధేయ రామ’ ట్రైలర్ ఎలా ఉంది..?

రామ్ చరణ్ – బోయపాటి కాంబినేషన్ లో హైవోల్టేజ్ యాక్షన్ ప్యాక్ గా తెరకెక్కిన చిత్రం ‘ వినయ విధేయ రామ’. సంక్రాంతి బరిలో రాబోతున్న ఈ యాక్షన్ ప్యాక్ ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. మొదటిసారి బోయపాటి డైరెక్షన్లో చరణ్ నటిస్తుండడం , రంగస్థలం తర్వాత చరణ్ నుండి వస్తున్న సినిమా కావడం తో ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొడుతుందని అంత ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అలాగే అనిపిస్తుంది.

“సరైన సింహం తగలనంతవరకూ ప్రతి వేటగాడు మగాడేరా… నాకు నీలా సైన్యం లేదు. ఒంట్లో బెరుకు లేదు.. చావంటే అస్సలు భయం లేదు..బై బర్తే డెత్తును గెలిచొచ్చా.. రా” అని అంటూ ఓ ఊరమాస్ డైలాగ్ వింటుంటే సినిమాలో యాక్షన్ పార్ట్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంది.

ఇక ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో ఈ కింది పోల్ ద్వారా తెలియజేయండి.