వీవీఎస్ లక్ష్మణ్..తెలుగులో ఏ హీరోల సినిమాలు చూస్తాడో తెలుసా..?

ప్రముఖ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్..ఈరోజు ఆస్క్ లక్ష్మణ్ పేరిట నెటిజన్లతో ముచ్చటించాడు. డిబేట్లు భాగంగా నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాదానాలు తెలిపి ఆకట్టుకున్నారు. జాతీయ స్థాయిలో ఆడగల ప్రతిభావంతులైన ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు. కానీ టోర్నీలు గెలిచినప్పుడే సరైన గుర్తింపు దక్కుతుందని వీవీఎస్ తెలిపాడు.

అలాగే తాను శాకాహారినని చెప్పిన లక్ష్మణ్.. తనకు బిర్యానీ అంటే ఇష్టమని, ప్యారడైజ్ బిర్యానీ అంటే మరింత ఇష్టమని చెప్పుకొచ్చాడు. మీ ఫేవరెట్ తెలుగు యాక్టర్ ఎవరు అని అడుగగా.. తెలుగులో ఎంతో మంది టాలెంటెడ్ యాక్టర్లు ఉన్నారన్న వీవీఎస్.. మహేష్ బాబు, నాని సినిమాలను చూడటాన్ని ఎంజాయ్ చేస్తానని చెప్పాడు. బాలీవుడ్‌లో తన ఫేవరెట్ యాక్టర్.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ అని చెప్పుకొచ్చాడు. లక్ష్మణ్ తమ హీరోల పేర్లు చెప్పడం తో అభిమానులు పండగా చేసుకుంటున్నారు.