‘వినయ విధేయ రామ’ లో చరణ్ పాత్ర ఇదేనా..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న తాజా చిత్రం ‘వినయ విధేయ రామ’. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్షన్లో రాబోతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఫై మెగా అభిమానుల్లోనే కాక సామాన్య సినీ ప్రేక్షకుల్లో సైతం ఈ సినిమాఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. వారి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కించినట్లు చిత్ర యూనిట్ చెపుతున్నారు. ఇప్పటికే చిత్రానికి సంబందించిన టీజర్, పోస్టర్స్ ఇలా అన్ని కూడా సినిమాఫై క్రేజ్ తెచ్చాయి.

ఇక ఈ మూవీలో చరణ్ పాత్ర ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనే కోరిక అభిమానుల్లో ఎక్కువైంది. సినీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాలో చరణ్ ఒక అనాథగా కలిపించబోతున్నాడని తెలుస్తోంది. అనాథగా పెరిగిన చరణ్ కు ఎలాంటి ఫ్యామిలీ దక్కింది…వారి కోసం చరణ్ ఏం చేసాడు..అనేది సినిమా కథ అంటున్నారు. మరి ఇది ఎంత వరకు కరెక్ట్ అనేది సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.

ప్రస్తుతం మిగిలి ఉన్న ఐటెం సాంగ్ ను ఈరోజు నుండి అన్నపూర్ణ స్టూడియోలో మొదలు పెట్టనున్నారు. ఈ సాంగ్ లో బాలీవుడ్ సెక్సీ బ్యూటీ ఇషా గుప్తా, చరణ్ తో చిందులు వేయబోతుంది. ప్రశాంత్, స్నేహ, ఆర్యన్ రాజేష్ వంటి ఇతర తారాగణంతో రూపొందిన ఈ సినిమాను సంక్రాతి కానుకగా రిలీజ్ కానుంది.