ఊపిరి పీల్చుకున్న 53 మంది కూలీలు ..

గత 10 రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే.. ఈ వర్షాల కారణంగా అన్ని నదులు ఉప్పొంగిపోతున్నాయి. ఈ వరద ఉధృతకు ప్రజలెవరూ నదుల ఫై ప్రయాణం చేయకూడదని ప్రభుత్వం సూచిస్తుంది. అయినాగానీ కొంతమంది మాత్రం ప్రభుత్వ సూచనలను పట్టించుకోకుండా ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.

గత రాత్రి శ్రీకాకుళం జిల్లా వంశధార నదిలో లారీలో ఇసుక నింపటానికి వెళ్లిన 53 మంది కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసు శాఖ అధికారులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలకు ప్రారంభించారు. తొలుత 24 మందిని కూలీలను అధికారులు కాపాడారు. కానీ వరద ఉధృతి పెరగడంతో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది ఆధ్వర్వంలో ఈ తెల్లవారు జామున మిగిలిన వారిని ఒడ్డుకు చేర్చారు. మొత్తం 53 మందిని సురక్షింతగా కాపాడామని, వర్షా కాలంలో నదుల్లో పనిచేసేముందు అప్రమత్తంగా వ్యవహరించాలని అధికారులు తెలిపారు. ప్రాంతాలనుండి బయటపడ్డామని ఆ కూలీలు చెపుతున్నారు.