ఈరోజు నుండి తెలంగాణ లో బతుకమ్మ సంబరాలు..

ఈరోజు నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు మొదలు కానున్నాయి. తొమ్మిది రోజులపాటు ఈ బతుకమ్మ ను ఆడవారు ఎంతో వైభవంగా జరుపుకుంటారు. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక ఈ పండుగ. బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రంలోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు.

ఈరోజు (అక్టోబరు 9 ) నుంచి అక్టోబర్ 17 వరకు ఈ ‘బతుకమ్మ పండుగ’ సంబరాలు జరుగనున్నాయి. మనిషికి, ప్రకృతితో ఉన్న సంబంధానికి ప్రతీకగా బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్ని, ఆనందాన్నిస్తుంది. అలాంటి ప్రాస్తశ్యం బతుకమ్మ పండుగకు ఉంది. అందుకే తొమ్మిది రోజులపాటు పూలనే దేవతలుగా ఆరాధిస్తూ ఆడవారు జరుపుకుంటారు. ఇక ఈ తొమ్మిది రోజుల బతుకమ్మకు తొమ్మిది పేర్లతో పిలిచుకుంటారు.

మొదటి రోజు : ఎంగిలిపూల బతుకమ్మ
రెండో రోజు : అటుకుల బతుకమ్
మూడో రోజు : ముద్దపప్పు బతుకమ్మ
నాల్గొవ రోజు : నాన బియ్యం బతుకమ్మ
ఐదో రోజు : అట్ల బతుకమ్మ
ఆరోవ రోజు : అలిగిన బతుకమ్మ
ఏడో రోజు : వేపకాయల బతుకమ్మ
ఎనిమిదొవ రోజు : వెన్నముద్దల బతుకమ్మ
తొమ్మిదొవ రోజు : సద్దుల బతుకమ్మ (చివరిరోజు)

ఇలా తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ఇక ఈ బతుకమ్మ పండగను తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎంతో వైభవంగా జరుపుతుంది.