ఆర్టీసీ క్రాస్ రోడ్డు లో ఇక ఆ బిర్యానీ తినలేరు..

బిర్యానీ ప్రియులకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు అంటే ఎంతో ఇష్టం ఎందుకో తెలుసా..అక్కడ బావర్చి హోటల్ లో దొరికే బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీకి ఈ రెస్టారెంట్ పెట్టింది పేరు. మధ్యాహ్నం మైన , రాత్రి యినా ఈ ఏరియా బావర్చి జనాలతో కిక్కిరిసి పోతుంది. అక్కడ బిర్యానీ తినాలంటే కనీసం గంట సేపైనా ఎదురుచూడక తప్పదు. అలాంటి ఫెమస్ బావర్చి హోటల్ ను అధికారులు సోమవారం (జనవరి 7) సీజ్ చేశారు. ఈ విషయం తెలిసి అంత షాక్ అయ్యారు.

అధికారులు వందలసార్లు చెప్పిన..హెచ్చరిన హోటల్ నిర్వాహకులు వ్యర్థ పదార్థాల నిర్వహణ చేపట్టడంలేదని హోటల్ ను ఈరోజు సీజ్ చేసారు. బావర్చి నిర్వాహకులు తడి, పొడి చెత్తను వేరుచేయడంలేదని.. అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయడంలేదని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌-15 ఏఎంహెచ్‌వో డాక్టర్‌ హేమలత మీడియాతో అన్నారు. ఆర్గానిక్‌ వేస్ట్‌ కన్వర్టర్‌ యంత్రాన్ని పెట్టుకోవాలని సూచించినప్పటికీ వారు ఇప్పటికీ స్పందించలేదని దాంతో ఈరోజు సీజ్ చేయాల్సి వచ్చిందని చెప్పారు.