మళ్లీ ప్రారంభమైన బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్‌ ..

మెహిదీపట్నం నుంచి హైటెక్‌సిటీ, కూకట్‌పల్లి ప్రాంతాలకు ప్రయాణించే వాహనదారులకు ట్రాఫిక్ సమస్య నుంచి కాస్త ఉపశమనం కోసం బయోడైవర్శిటీ ఫ్లైఓవర్‌ను కేటీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఫ్లైఓవర్‌ ప్రారంభమైందో లేదో దానిపై వరుస ప్రమాదాలు జరుగుతుండడం తో దానిని కొన్ని రోజుల క్రితం మూసివేశారు. ఆ తర్వాత నిపుణుల కమిటీ సూచనల మేరకు 43 రోజుల తర్వాత తిరిగి ఫ్లై ఓవర్‌పై రాకపోకలకు అనుమతులు ఇచ్చారు.

ఇవాళ ఉదయం ఫ్లై ఓవర్‌ను మేయర్‌ బొంతు రామ్మోహన్‌, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించారు. ఈ సందర్భాంగా మేయర్ మాట్లాడుతూ..వేగం 40 కంటే మించకూడదన్నారు. స్పీడ్‌ లిమిట్‌ కంట్రోల్‌ కోసం చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కెమెరాలు, స్పీడ్‌ గన్స్‌, వేగ నియంత్రికలు ఏర్పాటు చేశామని బొంతు రామ్మోహన్‌ వెల్లడించారు.