బుల్ బుల్ విలయం… 9 మంది మృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన బుల్ బుల్ తుఫాన్ బెంగాల్-బంగ్లాదేశ్ మధ్య తీరం దాటింది. దీంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్, పారదీప్, బంగ్లాదేశ్ తీరాల్లో గంటకు 120 నుండి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. దక్షిణ పరగణా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉంది సుమారు నాలుగు లక్షల మంది ప్రజలు తుపాను ప్రభావాన్ని చవిచూశారు. ఇప్పటివరకు 9 మంది మరణించారు.

బుల్ బుల్ ప్రభావం నేపథ్యంలో, రాజకీయ విభేదాలన్నీ పక్కనబెట్టి ప్రధాని నరేంద్ర మోదీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఫోన్ చేశారు. తుపాను కారణంగా జరిగిన నష్టం వివరాలను మమతను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రాన్ని తప్పకుండా ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మమతా ఇవాళ మొత్తం కంట్రోల్ రూమ్ లోనే ఉండి అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిస్థితిని సమీక్షించారు