వణికిస్తున్న ‘కరోనా’ వైరస్ ..

ప్రస్తుతం ఎక్కడ విన్న కరోనా వైరస్ పేరు మారుమోగిపోతుంది..సోషల్ మీడియా లోను ప్రతి ఒక్కరు దీనిని విపరీతంగా షేర్ చేస్తూ జాగ్రత్తగా ఉండాలని చెపుతున్నారు. చైనాలో విజృంభించిన ఈ వైరస్ ఇప్పుడు హైదరాబాద్ ను కూడా వణికిస్తోంది. చైనా నుంచి వచ్చిన ముగ్గురు హైదరాబాదీలకు ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. వీరికి నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో ప్రత్యేకంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరిలో ఒకరికి పాజిటివ్ లక్షణాలు వచ్చాయని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

నిన్న, మొన్నటి వరకు భయపెట్టిన స్వైన్‌ ఫ్లూ కాస్త తగ్గుముఖం పట్టగానే కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. గత కొంతకాలంగా చైనాను భయపెడుతున్న ఈ వైరస్ క్రమంగా ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. రోజు రోజుకి కరోనా వైరస్ కాటేసిన వారి సంఖ్య పెరిగిపోతోంది. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు.

ఈ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే..

* ఈ వ్యాధి సోకిన వారికి ముక్కు కారుతూనే ఉంటుంది. గొంతు మంటగా ఉంటుంది.
* తలనొప్పి, జ్వరం, దగ్గు ఉంటాయి. ఆరోగ్యంగా లేనట్లు అనిపిస్తుంది.

ఫై విధంగా అనిపిస్తే వెంటనే డాక్టర్ను కలవాలి. ఈ వ్యాధి ఎలా వ్యాపిస్తుందటే..

* ప్రస్తుతం ఇది మనుషుల నుంచీ మనుషులకు వ్యాపిస్తోంది.
* వ్యాధి వచ్చిన వ్యక్తి తుమ్మినా, దగ్గినా పక్క వారికి వచ్చే ప్రమాదం ఉంది.
* వైరస్ సోకిన రోగిని టచ్ చేసినా, షేక్ హ్యాండ్ తీసుకున్నా వచ్చే ప్రమాదం ఉంది.
* రోగి ముట్టుకున్న వస్తువుల్ని ముట్టుకున్నా అక్కడ ఉండే వైరస్ ఊపిరి తిత్తుల్లోకి వెళ్లే ప్రమాదం ఉంది.