తీరం దాటిన ‘దయె’..

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీరం దాటింది..ఈ అల్పపీడనానికి దయో అనే పేరు పెట్టారు వాతావరణ శాఖ. ఈ అల్పపీడనం తుపాన్‌ గా మారి ఈ ఉదయం తీరం దాటింది. తీరం వెంబడి గంటకు 70 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దయె క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. మరో 12 గంటల పాటు మత్స్యకారులు చేపలవేటకు వెళ్లరాదని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలపడి గురువారం రాత్రికి తుపానుగా మారిన సంగతి తెలిసిందే.

దయె క్రమంగా బలహీనపడి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ తుఫాన్ కారణంగా ముందస్తు జాగ్రత్తలు మొదలు పెట్టింది. సముద్రంలోనికి ఎవరును చేపల వేటకు వెళ్లకూడదని సూచించింది. తెలంగాణలో కూడా ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.