‘దిశ’ నిందితుల ఎన్ కౌంటర్ లో సంచలన ట్విస్ట్..

దిశ హత్య కేసు నిందితులను శుక్రవారం ఉదయం చటాన్‌పల్లి దగ్గర ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. అసలు ఈ ఎన్ కౌంటర్ ఎలా జరిగింది..ఎన్ని గంటలకు జరిగింది అనే విషయాలను సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ మీడియాకు తెలుపడం జరిగింది. ఈ ఎన్ కౌంటర్ పట్ల మానవ హక్కుల సంఘం కోర్ట్ లో పిటిషన్ వేయడం తో ఈ ఎన్ కౌంటర్ రోజు వార్తల్లో నిలుస్తుంది. కాగా ఈ కేసులో సంచలనం ట్విస్ట్ చోటుచేసుకుంది.

ఎన్‌కౌంటర్ చేసిన నిందితుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నారని కొత్త అంశం తెరమీదకు వచ్చి సంచలనం సృష్టిస్తోంది. ప్రధాన నిందితుడైన మహమ్మద్ ఆరిఫ్ కి 26ఏళ్ళు ఉండగా… మిగతా నిందితులు శివ, నవీన్, చెన్నకేశవులుకు 20 ఏళ్ళు ఉంటాయని సీపీ సజ్జనార్ చెప్పినప్పటికీ.. జాతీయ మానవ హక్కుల కమిషన్ నిందితుల తల్లిదండ్రులను విచారించగా ఇద్దరు నిందితుల తల్లిదండ్రులు తమ కొడుకులు మైనర్లని కూడా చూడకుండా ఎన్‌కౌంటర్ చేశారు అంటూ జాతీయ మానవ హక్కుల కమీషన్ స్టేట్‌మెంట్ ఇచ్చినట్లు సమాచారం.

మృతుల ఆధార్ కార్డు, సర్టిఫికెట్ వివరాలను పరిశీలించగా… తేదీలు వేరువేరుగా ఉండడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగింది. శివ, చెన్నకేశవులకు 18ఏళ్లలోపే వయసు ఉన్నట్లు వారి బోనఫైడ్ సర్టిఫికెట్లు స్పష్టం చేస్తున్నాయి. శివ వయసు 17 ఏళ్ల 3నెలల 21 రోజులు. చెన్నకేశవుల వయసు 15ఏళ్ల 7నెలల 26 రోజులుగా ఉంది. మరి ఇప్పుడు ఈ కేసు ఎటు తిరుగుతుందో..దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు..ఇప్పుడు పోలీసులకు పెద్ద చిక్కుల మారింది.