ఆసుపత్రిలో చేరిన కరుణానిధి..అభిమానుల్లో ఆందోళన

మరోసారి కరుణానిధి ఆసుపత్రి లో చేరడం అభిమానుల్లో , కార్య కర్తల్లో తీవ్ర ఆందోళన మొదలు అయ్యింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి ఈ తెల్లవారుజామున స్థానిక ఆళ్వారుపేటలోని కావేరీ ఆస్పత్రిలో చేరారు.

95 ఏళ్ల కరుణానిధి గత ఏడాది గొంతు ఇన్‌ఫెక్షన్, ఊపిరితిత్తులు సమస్యలతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఆయనకు శ్వాస ఇబ్బందుల నుంచి ఉపశమనానికి విండ్‌పైప్ అమర్చి చికిత్స అందించారు. ఇటీవలే ఇంటికి వచ్చిన కరుణానిధి , తాజాగా ఈరోజు మళ్లీ ఆసుపత్రి లో చేరడం తో అసలు ఏమవుతుంది..ఏం జరుగుతుందని అందరూ ఆరా తీయడం మొదలు పెట్టారు.

డీఎంకే కార్య కర్తలు , నాయకులు పార్టీ కార్యాలయం అన్నా అరివాలయం, గోపాలపురంలోని ఆయన నివాసగృహం, కావేరి ఆస్పత్రి వద్ద పెద్ద సంఖ్యలో చేరుకొని ఆరా తీస్తున్నారు. డాక్టర్స్ మాత్రం కరుణానిధి బాగానే ఉన్నారు..చిన్నపాటి చికిత్స కోసమే ఆసుపత్రి కి తీసుకోవాల్సి వచ్చిందని చెపుతున్నారు.