పసిడి ధర పడిపోవడం వెనక.. !

బంగారం ధర ఐదు నెలల కనిష్ఠానికి పడిపోయింది. నిన్న రూ.100 తగ్గిన బంగారం ధర నేడు రూ.250 తగ్గింది. దీంతో పది గ్రాముల బంగారం ధర రూ.30,800గా ఉంది. ఇందుకు రెండు కారణాలున్నాయని చెబుతున్నారు.

1. అంతర్జాతీయ పరిస్థితులు : అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం డిమాండ్‌ ఏడాది కనిష్ఠానికి పడిపోవడం కూడా ధర తగ్గుదలకు కారణంగా ట్రేడర్లు చెబుతున్నారు.

2. స్థానిక ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ మందగించడంతో పసిడి ధర పడిపోయినట్లు బులియన్‌ ట్రేడర్లు చెబుతున్నారు. ఆషాడం కావడంతో ప్రస్తుతం శుభాకార్యాలు లేవు. దీంతో స్థానిక ఆభరణాల తయారీదారులు బంగారం కొనడం లేదు.

ఇక, బంగారం బాటలోనే వెండి పయనించింది. రూ.620 తగ్గడంతో కిలో వెండి రూ.39,200గా ఉంది. పారిశ్రామిక వర్గాలు, నాణెల తయారీదారుల దగ్గర నుంచి కొనుగోళ్లు మందగించడంతో వెండి ధర తగ్గింది. సింగపూర్‌ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 0.32శాతం తగ్గడంతో 1,223.30 డాలర్లు పలికింది.